11, ఏప్రిల్ 2026, శనివారం

దేవాంగ పురాణం {70}

అత్యంత శక్తివంతమైన పాపకార్యము 

పాపములను కలుగచేసే కార్యములలో అత్యంత శక్తివంతమైన పాపకార్యము ఏది అంటే అన్య స్త్రీలను పొందుటయే అని సృతులు, ధర్మ శాస్త్రములు పేర్కొనినవి, కాబట్టి పాపమునకు భయపడునట్టి నాకు ఆ పని యుక్తము కాదు అది చేయదగినది కాదు, మూడు లోకముల యందు మిక్కిలి సొగసుకత్తె వైన రంభ నేను సుకృతములను చేయుట ద్వారా పరిశుద్ధుడను వైరాగ్యము చేత నన్ను నేను పొందుటయే ఫలము...

తపస్సే ధనముగా గల ఋషులు నిన్ను అనుభవిస్తారు అని చెప్పినావు, ఆ విషయమును నేను ఆలోచించను, ఎవరి బుద్ది వారిది ఎవరు కర్మ వారు అనుభవించ వలసినదే, తమ వ్రతము భంగము చేసుకొని నీతో అనుభవించిన వారి విషయమై నేనెందుకు వారి గురించి ఆలోచించాలి నాకు వారు సాటియనా, అనేక విధములైన ఈ చెడ్డ దేహమునకు సుఖము ఎక్కడ వున్నది అంతయు దుఃఖమే కలుగును గదా...

అటువంటి అశాశ్వతమైన దేహ సంబంధిత సుఖమును నేను కోరుకొనను, ఎవరు చేసిన కర్మలకు వారు బాధ్యులు కాక తప్పదు, పుణ్యకర్మ అయినా పాపకర్మ అయినా దాని నుండి వచ్చే ప్రతి ఫలమును అనుభవించ వలసినదే, కావున ఒకరి నడవడిని మనము ప్రశ్నింప వలసిన అవసరం లేదు, మన నడవడిక ధర్మ యుక్తంగా వున్నదా లేదా అని నిరంతరము బేరీజు వేసుకొనుచు ఉత్తమ జీవితం గడుపుకొనవలెను...

శరీర మిధంఖలు ధర్మసాధనము ఈ దేహము ద్వారా ధర్మ కార్యములు సాధించి ఇంకా ఉత్తమ జీవనం లభించేటట్లుగాను, ఉత్తమ జన్మలు కలుగునట్లుగాను చివరికి సాయుజ్య మోక్షమునకు కృషి చేసినచో నిత్యానందమును నిరంతరము అప్రితి హతముగా అనుభవించ వచ్చును, అటువంటి ఆనందము స్థిరమైనది, కాబట్టి దేహం ద్వారా లభించే క్షణీకమైన సుఖము కొరకు కాకుండా శాశ్వత సంబంధమైన ఆత్మానందము కలగటానికి కృషి చేయవలయును నా అభిమతము అదే...

కావున అధికముగా మాటలాడి ఎన్ని విధములుగా ప్రాధేయపడినను నేను నిన్ను చూడను, చూడను గాక చూడను, సమ్మతింపని నేను ఇతర కార్యములు చెయ్యజాలను, ఓ రంభా ఇన్ని మాటలేల నీ కోరికను నేను తీర్చను, కావున తక్షణం నీవు వెళ్ళ వలయును అని ధృడ సంకల్పం కలిగి చెప్పినాడు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దేవాంగ పురాణం {70}

అత్యంత శక్తివంతమైన పాపకార్యము  పాపములను కలుగచేసే కార్యములలో అత్యంత శక్తివంతమైన పాపకార్యము ఏది అంటే అన్య స్త్రీలను పొందుటయే అని సృతులు, ధర్మ ...