ఏ దుష్టుడో తెలివి లేకనో ఎవరైన తన భార్యను కాదని అన్య స్త్రీని కోరుకొనును, అటువంటి పురుషుడు అనేక జన్మలయందు చేసియున్న పుణ్య కర్మలన్నియు నశించును, అన్య స్త్రీని కోరిన తెలివిమాలిన వాడు పాపములను సంపాదించుకొని అనుభవించ కూడని వంటిదైన నరకమును పొంది యమ ధర్మరాజు భటులచేత బాధింప బడుదురు...
ఎవ్వడు దుష్టబుద్ధి కలిగి మోహమును నిగ్రహించలేక అన్య స్త్రీని కౌగిలించు కొనునో అనగా అతడు ఇంతకంటే మించిన సుఖము లేదని కదా, భావించుచు కౌగిలించుకొనినాడు అటువంటి వాడు ఈ లోకము నందు సత్కర్మలు చేయుటకు పనికిరాడు, అనగా అర్హత లేని వాడై వుండును...
తరువాత యమ భటులచే ఆ పురుషుడు బాగుగా కాల్చిన ఇనుమును స్త్రీని ఆలింగనముగా చేసుకొనిన విధముగా కాల్చిన ఇనుమును ఆలింగనము కఠినంగా చేయించెదరు, ఏ బుద్ధి హీనుడు చేయగూడనిది అయిన అన్య స్త్రీ సంపర్కమును ఆలోచింపక మద గర్వముతో ఇతరులకు బాధను కలిగించునైన ఈ పనిని చేయునో అట్టి పురుషుడు యమ భటుల చేత త్రేళ్ళచేత నిండి యుండు బొక్కలో అతని చేతిని బలవంతంగా పంపించి త్రేళ్ళచే కుట్టిపించి దుఃఖించమని భాధింతురు...
ఎవడు అన్య స్త్రీలను ముద్దు పెట్టుకొనునో {చుంబనము} అట్టివాడు యమ కింకరుల చేత భయంకరములైన విషములతో నిండిన కృరమైన పండ్లు కల ఆడ సర్పములను ముద్దు పెట్టుకొమ్మని బాధింతురు, కామమచేత మైకము కమ్మిన తెలివి తక్కువ వాడు అన్య స్త్రీలను కామ భావంతో చూచునో అతని కన్నులను యమ కింకరులు కోపముతో సూదుల వంటి వానిచేత కంటిని పొడిచెదరు...
కాబట్టి ఎన్ని విధములుగా ఆలోచించినను అన్య స్త్రీలతో సంబంధము వలన పాపములు వృద్ధి చెందగలవు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి