10, ఏప్రిల్ 2026, శుక్రవారం

దేవాంగ పురాణం {66}

నీతో పొందు సమంజసమే 

రాజా నీవు మిక్కిలి మోహనాకారము కలవాడవు, జయంతుడు, రతీదేవి భర్త మన్మధుడు, వసంతుడు, నలకూబరుడు అను వారు మాత్రమే మహా సుందరాకారులు గాను, సొగసు కారులుగాను మిక్కిలి పేరు ప్రఖ్యాతులు పొందినవారు, కాని వీరు ఎవ్వరు కూడా సౌందర్యము నందు నూరు వంతులలో అయిదు వంతులైనను నీతో సరిరారు...

నీవు అపురూపమైన అమోఘమైన బహు సుందర రూపుడవు, మోహనాకారము గల వాడవు దేవతా పురుషులలో ఎందరెందరినో నేను చూచితిని వారెవ్వరు నీ అంద చందాలకు సరిరారు, అందువలననే త్రిలోక సుందరినైన నేను త్రిలోక సుందరుడవైన నీతో పొందు కోరుట సమంజసమే, సమ ఉజ్జీగా వుంటుంది...

లోకము మెచ్చుకొన దగిన కార్యమే, త్రిలోక మోహన కారియైన రంభు అంతకు మించిన సుందరా కారుడుతో సఖ్యత కలుగుట ఈడు జోడు కుదిరిందని అందరూ మెచ్చుకొనుదురు, కావున నిన్ను తలచి నీ కోరకు వచ్చినాను, ఏ స్త్రీ తనకు తానుగా వరించి రాదు, కాని నేను నిన్ను వరించి వచ్చినందులకు చులకన చేయవలదు దేవలరాజా నా మన్మధ తాపమును శీఘ్రముగా తీర్చవోయి...

నిన్ను చూచినప్పటి నుండి నా మనస్సు నిలవడంలేదు నేనెపుడు దేవాంగునిని చూచెదనా అని విరహాగ్నితో తపించి పోవుచున్నాను, ఈ దేవాంగుడు నన్ను ఎప్పుడు పరిగ్రహించునా అని పదేపదే తలచుచున్నాను, కావున ఇక అలస్యం చేయక నీ బిగి కౌగిటిలో నన్ను బంధింపుము, నా కామ జ్వరమును నశింపజేయుము, ఇక ఆలస్యం చేయవలదు నేను నిరీక్షించ లేక పోవుచున్నాను...

పడక యందు, నడక యందు, ఉనికి యందు మరియు ఇతర పనుల యందున్న నా మనస్సు ఆహరహం నిన్నే కోరుతున్నది, నేను నిన్ను చూసి మిక్కిలి కామ వికారము పొందితిని, ఈ బాధ నుంచి నన్ను తప్పించు, ప్రతి క్షణం నిన్ను గురించే ఆలోచించు చున్నాను, ఈ విధముగా నా మనస్సును హరించి వేసినావు, నా మదిలో నీవు తప్ప అన్యము ఏదియును లేదు, నేను నిన్ను చూసిన మొదలు నుంచి మన్మధుడు తన బాణములు నాపై ప్రయోగించుచూ నన్ను మిక్కిలి బాధించుచున్నాడు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దేవాంగ పురాణం {68}

దేవలుడు ఈ దేహము దుఃఖదాయకం అని చెప్పి రంభను తిరస్కరించుట  ఓ సొగసైన కనుబొమ్మలు కలదానా నీకు నేను ముందే సమాధానము చెప్పితిని, ఇప్పటికిని నీవు ఎన్...