నాకు తెలిసి మన్మధుని బాణములు పూవుల వంటివని అంటారు, కాని అవి పూవులు కావు నిప్పులు వంటివి నాకు, అతనిచేత ప్రయోగింప బడిన బాణాలు నాకు కామ జ్వరమును కలుగజేసినవి, ఓ స్వామీ నన్ను ఆ పాపాత్ముని బాణాలకు గురి చేయనీయవద్దు, శీఘ్రముగా నన్ను పరిగ్రహించు, నా సంతాపమును తీర్చుము, నీ పెదవి యందలి అమృతమును నాకు ఇచ్చి నా మనస్సు నందలి తాపమును తీర్చుము, దయకు గని వంటి దేవలుడా నేను నిన్ను మిక్కిలిగా వేడుకొనుచున్నాను...
నీవు నన్ను స్వీకరింపుము, ధృడముగా కౌగిలించుకొని నీ ధృడమైన భుజములు కదులునట్లు నీ అంగములో నా అంగములు చేర్చినట్లు గట్టిగా కౌగలించుకొనుము, నా పెదవిని కొరుకుచూ నన్ను పొందుము, మన్మధ కళా స్థానములైన 16 స్థానములను ప్రీతి చెందించుము, ఒకరినొకరు చూచుకొనుట వలన ఇద్దరి దంత కాంతులు ప్రకాశించునట్లు నవ్వుచు నాతో శీఘ్రముగా రమించుము, కామ క్రీడ యందు నన్ను ముంచెత్తుము...
ఓ మన్మధునితో సమమైన సొగసు కలవాడా ఓహో అయ్యో బ్రహ్మదేవుడు నీ మనస్సును వజ్రముతో చేసినట్లున్నదే అట్లు కాని పక్షమున రాజా నేను ఈ విధముగా మిక్కిలి దీనముగా నిన్ను వేడుచున్నను, నీకు కనికరము లేకుండా పోయినది, మూడు లోకములకు సొగసుకత్తె అయినా రంభ ఈ విధముగా దీనాతిదీనయై నిన్ను వేడుకొను చున్నను నీకు నాపై కనికరమే లేకపోయెనే, నేను ఇంతగా వేడుకొనుచున్నాను, నీవు ఒక్కమాట కూడా చెప్పటం లేదు, మూగవలె వున్నావు...
ఓ రాజా మారుమాట నీకు తోచదా నీ నుండి ఎటువంటి మాటకూడా రాకుండా వుంటున్నదే, ఓహో నీ మనస్సు మిక్కిలి కఠినము కలది కాబోలు అందువలన నీ నుండి ఎటువంటి మాట రావడం లేదు, నీతో పొందుకు నాకు అంగీకరిస్తావా, లేదా తిరస్కరిస్తావా, ఏదో ఒక మాట చెప్పుము, నా దారిన నేను పోయెదను, ఈ విధముగా రంభ దీన వదనయై పలికినది, అప్పుడు దేవల మునీశ్వరుడు చిరునగవు నవ్వుచూ రంభకు సమాధానము చెప్పసాగెను...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి